బిడ్డకు జన్మనిచ్చిన రాధికా ఆప్టే..! 8 d ago
లెజెండ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నటి "రాధికా ఆప్టే" తన మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా ఈ విషయాన్నీ తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. తాను లాప్ టాప్ లో పని చేసుకుంటున్న సమయంలో బిడ్డకు పాలిస్తూ దిగిన ఫోటో ను షేర్ చేశారు. 2011 లో బ్రిటన్ కు చెందిన బెనెడిక్ట్ టేలర్ తో రాధికాకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో రాధికా, టేలర్ లు 2012 లో పెళ్లి చేసుకున్నారు.